సినిమాలు రాజకీయాలు వేరు వేరు కాదు.. ఈ రెండు రంగాల మధ్య ఏదో విడదీయరాని అనుబంధం ఉంది.
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సాంగ్స్, టీజర్స్ అంటూ ఒక్కోక్క అస్త్రాన్ని బయటకు తీసి.. సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నారు టీమ్. ఇక గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతొంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక అది దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. భారీ ఎత్తున గేమ్ ఛేంజర్ ను జానాల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మూవీ టీమ్. ఈక్రమంలో గేమ్ ఛేంజర్ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తున్నా ఈ కథ రాసింది మాత్రం తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. అయితే ఈ సినిమాకు కొన్ని డైలాగ్స్ ను మాత్రం కార్తిక్ ఓ పొలిటికల్ లీడర్ తో రాయించాడట. ఆయన ఓ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా. ఆయన మరెవరో కాదు తమిళనాడులో మధురై ఎంపీగా ఉన్న వెంకటేశన్. అవును ఆయన గేమ్ ఛేంజర్ సినిమాకు తమిళం లో డైలాగ్స్ రాశారంట.
వెంకటేశన్ కమ్యునిస్ట్.. మంచి రైటర్ కూడా. సిపిఐ పార్టీకి చెందిన వెంకటేశన్ ప్రస్తుతం మధురై ఎంపీగా ఉన్నారు. అంతే కాదు తమిళనాటు ఆయన మంచి రైటర్ గా కూడా ఉన్నాడు. ఇప్పటికే వెంకటేశన్ కొన్ని పుస్తకాలు కూడా రాసారు. ఆయన రాసిన కావల్ కొట్టం అనే పుస్తకానికి తమిళ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఇతను తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్, యాక్టర్స్ అసోసియేషన్ లో కూడా మెంబర్ గా ఉన్నారు వెంకటేశన్.
ఇక వెంకటేషన్ కు డైరెక్టర్ శంకర్ తొ మంచి స్నేహం ఉంది. వీరిమధ్య అనుబంం.. వెంకటేషన్ రైటింగ్ స్టైల్ తెలుసు కాబట్టి.. వెంకటేశన్ ట్యాలెంట్ చూసి గేమ్ ఛేంజర్ సినిమాలోని కొన్ని పొలిటికల్ సీన్స్ కు ఈయనతో తమిళ్ వర్షన్ డైలాగ్స్ రాయించాడు శంకర్. మరి ఆ డైలాగ్స్ ఏ రేంజ్ లో పేలతాయో చూడాలి. ప్రస్తుతం వెంకటేషన్ ఈసినిమాతో బయట ప్రపంచానికి రైటర్ గా పరిచయం అయ్యి..ముందు ముందు కూడా సినిమాలకు పనిచేస్తారేమో చూడాలి.