Virat Kohli : కోహ్లీ రెస్టారెంట్లో తమిళ వ్యక్తికి చేదు అనుభవం
దేశంలో, ఇతర దేశాల్లోని పలు రెస్టారెంట్లకు(Restuarents) కొన్ని నిబంధనలు ఉంటాయి. పర్టికులర్ డ్రెస్ కోడ్(Dress code) ఉంటేనే లోనికి అనుమతిస్తాయి. కస్టమర్ల9Customers) డ్రెస్ కోడ్ ఆధారంగా కొన్ని రెస్టారెంట్లలో అనుమతి నిరాకరిస్తుంటాయి. టీమిండియా (Team india)స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి(Virat kohli) చెందిన రెస్టారెంట్ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. పంచెకట్టుతో రెస్టారెంట్‌కు వచ్చాడని తమిళనాడుకు(Tamilnadu) చెందిన ఓ వ్యక్తిని ఆ రెస్టారెంట్ లోనికి అనుమతించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social media) గింగిరాలు తిరుగుతోంది. ముంబైలోని(Mumbai) జుహూ ఏరియాలో భారత క్రికెటర్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ 'వన్-8 కమ్యూన్'కు(one8 Commune) తమిళనాడుకు చెందిన వ్యక్తి వచ్చాడు.
దేశంలో, ఇతర దేశాల్లోని పలు రెస్టారెంట్లకు(Restaurants) కొన్ని నిబంధనలు ఉంటాయి. పర్టికులర్ డ్రెస్ కోడ్(Dress code) ఉంటేనే లోనికి అనుమతిస్తాయి. కస్టమర్ల9Customers) డ్రెస్ కోడ్ ఆధారంగా కొన్ని రెస్టారెంట్లలో అనుమతి నిరాకరిస్తుంటాయి. టీమిండియా (Team India)స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి(Virat Kohli) చెందిన రెస్టారెంట్ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. పంచెకట్టుతో రెస్టారెంట్‌కు వచ్చాడని తమిళనాడుకు(Tamilnadu) చెందిన ఓ వ్యక్తిని ఆ రెస్టారెంట్ లోనికి అనుమతించలేదు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social media) గింగిరాలు తిరుగుతోంది. ముంబైలోని(Mumbai) జుహూ ఏరియాలో భారత క్రికెటర్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ 'వన్-8 కమ్యూన్'కు(one8 Commune) తమిళనాడుకు చెందిన వ్యక్తి వచ్చాడు. ధోతీ, కుర్తా ధరించి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా అతనిని సిబ్బంది అడ్డుకున్నారు. ఈ రెస్టారెంట్‌కు డ్రెస్ కోడ్ ఉందని.. ఇలాంటి దుస్తులు వేసుకొని వస్తే లోనికి అనుమతించరని పేర్కొన్నారు. దీంతో అతను మనస్తాపం చెందాడు. తాను విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ను అని.. భారతీయ సాంప్రాదాయం(Traditionally) ప్రకారం దుస్తులు ధరించి వస్తే లోనికి అనుమతించరా అని ఎదురు ప్రశ్న వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. కోహ్లీ రెస్టారెంట్ సిబ్బంది తనను అనుమానించారని, తన పట్ల వివక్ష చూపారని ఆవేదన చెందాడు. ఈ ఘటనపై కోహ్లీ ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించాడు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. భారతీయ సాంప్రదాయలను అవమానపర్చారని ఆ రెస్టారెంట్ నిర్వాహకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. కుర్తా, ధోతీ(Kurtha, Dothi) గౌరవప్రదమైన దుస్తులని, ఫ్యాషన్(Fashion) పేరుతో విదేశీ పోకడలు ఇక్కడ సరికాదన్నారు.
భారత సాంప్రదాయలను అవమానించిన ఆ రెస్టారెంట్ సిబ్బంది వెంటనే క్షమాపణ(Apology) చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఇదంతా కావాలనే చేస్తున్నారని, సోషల్ మీడియాలో హైప్ కోసమే కోహ్లీని ఇందులోకి లాగారని విమర్శిస్తున్నారు. రెస్టారెంట్‌కు ఓ డ్రెస్ కోడ్ ఉంటుందని అది ఫాలో(Follow) అవ్వాల్సిందేనని, అలా కాకుండా ఇలా సీన్ చేయడం అవసరమా అని మండిపడుతున్నారు. ఫ్యాన్సీ రెస్టారెంట్లలో కొన్ని నియమాలు ఉంటాయని, టేబుల్ సెన్స్(Table sense), డ్రెస్ సెన్స్(Dress sense) ఉంటుందన్నారు. అవి తప్పకుండా ఫాలో కావాల్సిందేనని కొందరంటుంటే... నిబంధనలు ఎలా ఉన్నా ట్రెడిషనల్ వేర్‌కు గౌరవం ఇవ్వాలని మరికొందరు చెప్తున్నారు.