తమిళనాడు(Tamil nadu) ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీబీఐకి(CBI) జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఇకపై తమిళనాడులో ఏ కేసునైనా దర్యాప్తు చేయాలంటే సీబీఐ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం(state Government) అనుమతి తీసుకోవాలి. గతంలో తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నాయి.
తమిళనాడు(Tamil nadu) ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీబీఐకి(CBI) జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఇకపై తమిళనాడులో ఏ కేసునైనా దర్యాప్తు చేయాలంటే సీబీఐ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం(state Government) అనుమతి తీసుకోవాలి. గతంలో తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నాయి. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని(Senthil Balaji) మనీలాండరింగ్(Money laundering) కేసులో ఈడీ(ED) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే(DMK) ప్రభుత్వం సీబీఐకి తలుపులు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్నాయి. ఇందులో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కేరళ, జార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు పదో రాష్ట్రంగా ఈ జాబితాలో చేరింది.