తమిళ సినిమా మామన్నన్‌(Maamannan)జూన్‌ 29న విడుదలయ్యింది. మంచి రెస్పాన్స్‌ను సంపాదించుకుంది. చూసిన వారంతా మంచి సినిమా అని ప్రశంసిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Tamil Nadu CM Stalin) కూడా మామన్నన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా నటించడమే కాకుడా రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.

తమిళ సినిమా మామన్నన్‌(Maamannan)జూన్‌ 29న విడుదలయ్యింది. మంచి రెస్పాన్స్‌ను సంపాదించుకుంది. చూసిన వారంతా మంచి సినిమా అని ప్రశంసిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Tamil Nadu CM Stalin) కూడా మామన్నన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin) హీరోగా నటించడమే కాకుడా రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. కీర్తి సురేశ్‌(Keerthy Suresh)ఇందులో హీరోయిన్‌గా నటించారు. టైటిల్‌ రోల్‌ను వడివేలు పోషించారు. పరియేరుమ్‌ పెరుమాళ్‌, కర్ణన్‌ సినిమాలతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న మారి సెల్వరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే లోక నాయకుడు కమలహాసన్‌, అగ్ర కథానాయకుడు ధనుష్‌ వంటి ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి ఎంతగానో ప్రశంసించారు. మామన్నన్‌ సినిమాను గురువారం ఉదయ చెన్నైలోని ఒక ప్రివ్యూ థియేటర్‌లో ముఖ్యమంత్ర ఎం.కె.స్టాలిన్‌ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

మామన్నన్‌ సినిమాను చూసిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ చాలా బాగుందంటూ ప్రశంసించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మామన్నన్‌ సినిమాను మెచ్చుకున్న కమలహాసన్‌, ధనుష్‌లను ఉదయనిధి స్టాలిన్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated On 30 Jun 2023 1:53 AM GMT
Ehatv

Ehatv

Next Story