దక్షిణాది ప్రాంతంలో బలమైన ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ(BJP) అందుకు తగ్గట్టుగానే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. తమిళనాడులో(Tamilnadu) డీఎంకేకు(DMK) గట్టిపోటీనిచ్చి రాష్ట్రంలో గణనీయమైన స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) తమిళనాడులోని ప్రఖ్యాత శైవక్షేత్రం రామేశ్వరం(Rameswaram) (రామనాథపురం నియోజకవర్గం) నుంచి ప్రధాని మోదీ(PM Narendra Modi) పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

దక్షిణాది ప్రాంతంలో బలమైన ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ(BJP) అందుకు తగ్గట్టుగానే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. తమిళనాడులో(Tamilnadu) డీఎంకేకు(DMK) గట్టిపోటీనిచ్చి రాష్ట్రంలో గణనీయమైన స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) తమిళనాడులోని ప్రఖ్యాత శైవక్షేత్రం రామేశ్వరం(Rameswaram) (రామనాథపురం నియోజకవర్గం) నుంచి ప్రధాని మోదీ(PM Narendra Modi) పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై తమిళ మ్యాగజైన్ 'మలై మలర్'(Malai Malar magazine)లో ఒక కథనం కూడా వచ్చింది. ప్రస్తుతం ఇదే ఇష్యూ పై తమిళనాడు బీజేపీ వర్గాలలో జోరుగానే చర్చలు సాగుతున్నాయి అని సమాచారం.

ఇప్పటివరకు ఎవరూ బహిరంగంగా చెప్పకపోయినా ప్రధాని రామేశ్వరం నుంచి పోటీచేయడం పై క్షేత్ర స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మోడీ రామేశ్వరం నుంచి పోటీ చేస్తే ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని, తమ పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. రామేశ్వరం నుంచి పోటీ చేయడం పై స్పష్టత రాకపోయినప్పటికీ ఈ సారి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో పాటు, రామేశ్వరం నుంచి కూడా పోటీ చేసి రెండు స్థానాల్లోనూ మోడీ విజయం సాధిస్తారని పార్టీ విశ్వశిస్తుంది. రెండు నియోజకవర్గాలు ప్రముఖ శివాలయాలే కావడం విశేషం. రామేశ్వరంతో కూడిన రామనాథపురం నియోజకవర్గంలో గణనీయమైన ముస్లిం ఓటర్లు ఉండటంతో ప్రధాని అక్కడనుంచి పోటీ చేస్తారనే వార్తకి ప్రాముఖ్యత సంతరించుకుంది. 2019 ఎన్నికలలో, DMK ఈ నియోజకవర్గాన్ని దాని భాగస్వామి కూటమి అయిన IMULకి కేటాయించింది. IMUL అభ్యర్థి నవాజ్ అద్భుతమైన విజయాన్ని ఇక్కడనుంచి సాధించారు.

అమిత్ షా ఈ విషయం పై సమాచారం ఇచ్చారా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చెన్నైలో పర్యటించినప్పుడు మోడీ రానున్న ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర నేతలతో అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించిన్నట్లు తెలుస్తోంది. తమిళ ప్రజలు ప్రధాని తమ రాష్ట్రం నుంచి గెలిచిన అభ్యర్థి కావాలనేది బలంగా అనుకుంటున్నారని అందుకే మోడీ రామేశ్వరం నుంచి పోటీ చేసే విషయం పై ఆలోచిస్తున్నాం అని అమిత్ షా అన్నట్లు సమాచారం. ప్రధాని రామనాథపురం నుంచి పోటీ చెయ్యాలని తానుకూడా కోరుకుంటున్నట్లు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా అనుకుంటున్నారని అయితే ఈ విషయంపై పార్టీ జాతీయ కమిటీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బీజేపీ పెద్దలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో అక్కడ ప్రజాస్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకే అక్కడి నుంచే అన్నామలై పాదయాత్ర ప్రారంభించినట్లు కూడా బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలో మోదీ దక్షిణాదిన పోటీ చేయాలని పలువురు నేతలు సూచించినట్లు తెలిసింది.

మోదీ బరిలోకి దిగితే తట్టుకోగలరా: ఖుష్బూ?

ప్రధాని నరేంద్రమోదీ రామనాథపురంలో పోటీ చేస్తే ఆయనపై గెలిచే సత్తా డీఎంకేకు ఉందా అని ఖుష్బూ సవాల్‌ విసిరారు. తొమ్మిదేళ్లుగా ప్రజలతో మమేకమయ్యే ప్రధానిగా పేరు తెచ్చుకున్న మోదీ దేశంలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలవడం
ఖాయమన్నారు ఖుష్బూ. లోక్ సభ ఎన్నికలనాటికి మోడీ రామనాథపురం నుంచి పోటీ విషయం పై క్లారిటీ వస్తుందని ఇప్పటినుంచే దానిపై చర్చ సరికాదని ఆవిడ అన్నారు.

దక్షినాదినుంచి పోటీ చేసి సత్తా చాటిన ప్రముఖ నేతలెందరో

ఉత్తరాది అగ్రనాయకులు దక్షిణాది నుంచి పోటీ చేసి గెలుపొందడం గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. 1980 లో మెదక్ లోక్ సభ నుంచి పోటీచేసిన ఇందిరాగాంధీ 2లక్షల పై చిలుకు మెజారిటీ తో గెలిచి రికార్డు సృష్టించారు. 1999 లో కర్నాటకలోని బళ్లారి నుంచి పోటీచేసిన సోనియా గాంధీ ప్రత్యర్థి బీజేపీ సీనియర్ నాయకురాలు అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి సుష్మ స్వరాజ్ పై 56,000 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 2019లో జరిగిన ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో కేరళ వాయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సిపిఐ అభ్యర్థి పై 4లక్షల 31వేల ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

విందు సమావేశాలు అందుకేనా?

రామనాథపురం నుంచి మోడీ పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత రాకపోయినా ఇటీవల ఢిల్లీ లో NDA దక్షిణాది ఎంపీ లతో మోడీ సమావేశం కావడం, అంతరం సౌత్ ఇండియా డిషెస్ తో చేసి ఫొటోస్ ని మోడీ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం చుస్తే మోడీ దక్షిణాది నుంచి పోటీ చేసే అంశానికి బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Updated On 7 Aug 2023 3:24 AM GMT
Ehatv

Ehatv

Next Story