తమిళనాడులో(Tamilnadu) రాజకీయరంగాన్ని, సినీ రంగాన్ని వేర్వేరుగా చూడలేం! రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. సినీ నటులలో చాలా మందికి ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉండే ఉంటుంది. అందుకే తమిళనాడులో చాలా మంది హీరోలు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. తమిళనాడులో ఎంజీఆర్‌(MGR), జయలలిత(Jayalalitha) వంటి వారు మాత్రమే పాలిటిక్స్‌లో సక్సెసయ్యారు.

తమిళనాడులో(Tamilnadu) రాజకీయరంగాన్ని, సినీ రంగాన్ని వేర్వేరుగా చూడలేం! రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. సినీ నటులలో చాలా మందికి ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉండే ఉంటుంది. అందుకే తమిళనాడులో చాలా మంది హీరోలు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. తమిళనాడులో ఎంజీఆర్‌(MGR), జయలలిత(Jayalalitha) వంటి వారు మాత్రమే పాలిటిక్స్‌లో సక్సెసయ్యారు. మక్కల్‌ తిలకం ఎంజీఆర్‌ ఇప్పటికీ తమిళ ప్రజల ఆరాధ్యదైవమే! ఆ మాటకొస్తే అన్నాదురై, కరుణానిధి వంటి వారు కూడా సినీ రంగానికి చెందిన వారే! వారు కూడా ముఖ్యమంత్రులయ్యారు. సూపర్‌స్టార్‌ హోదాను దక్కించుకున్న రజనీకాంత్‌కు(Rajinikath) మాత్రం పాలిటిక్స్‌లోకి(Politics) రావడానికి ధైర్యం సరిపోలేదు. ఇదిగో అదిగో అంటూ చాన్నాళ్ల పాటు ఫ్యాన్స్‌ను ఊరించాడు. ఆ ధైర్యం అతడి సహనటుడు లోకనాయకుడు కమలహాసన్‌కు(Kamal Haasan) ఉంది. ఆ ధైర్యంతోనే మక్కల్‌ నీతిమయ్యం పేరుతో ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రముఖ హీరో విజయ్‌(Vijay thalapathy) కూడా రాజకీయాల్లోకి వచ్చేశాడు. పార్టీ పేరును కూడా అనౌన్స్‌ చేశాడు. ఇప్పుడేమో హీరో విశాల్‌(Vishal) వంతు. ఇతడు కూడా రాజకీయరంగ ప్రవేశానికి సంసిద్ధమవుతున్నాడు. నిజానికి విశాల్‌కు రాజకీయాలపై ఆసక్తి ఎప్పట్నుంచో ఉంది. ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు నామినేషన్ కూడా వేశారు. కాకపోతే విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరించారు. విశాల్‌ అభిమాన సంఘాలు ఎప్పట్నుంచో ప్రజా రక్షణ సంఘంగా ఏర్పడ్డాయి. ప్రజాసేవలో ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తన సినిమాల షూటింగ్‌ జరుగుతున్నప్పుడు అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని తనకు సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తున్నారు విశాల్‌. రాబోయే 2026 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాడట!

Updated On 7 Feb 2024 12:21 AM GMT
Ehatv

Ehatv

Next Story