గుజరాత్‌లోని(gujarat) వల్సాద్‌లో(Valsaad) ఒక టైలర్(Tailor) తన దుకాణం ఆస్తి విలువ కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు(Eletricity bill) రావడంతో షాక్‌కు గురయ్యాడు.
గుజరాత్‌లోని(gujarat) వల్సాద్‌లో(Valsaad) ఒక టైలర్(Tailor) తన దుకాణం ఆస్తి విలువ కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు(Eletricity bill) రావడంతో షాక్‌కు గురయ్యాడు. ముస్లిం అన్సారీ(Annsari) తన మామతో కలిసి దుకాణాన్ని నడుపుతున్నాడు. సాధారణంగా UPI ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తాడు. బిల్లు మొత్తం రూ. 86 లక్షలు చూడగానే అతని గుండె ఆగిపోయింది. దక్షిణ గుజరాత్‌లోని ఏడు జిల్లాల్లో 32 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని దక్షిణ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ఈ దుకాణం విద్యుత్ సరఫరా చేయబడుతుంది. అన్సారీ తన భారీ బిల్లును ఫ్లాగ్ చేసిన వెంటనే, డిస్కమ్ అధికారులు అతని దుకాణానికి చేరుకుని మీటర్‌ను పరిశీలించారు. వారు కనుగొన్నది ఏమిటంటే, మీటర్ రీడింగ్‌కు రెండు అంకెలు ఎక్కువ యాడ్ అయ్యాయని..దీంతో భారీగా బిల్లు వచ్చినట్లు తెలిపింది. మీటర్ రీడింగ్ తీసుకున్న వ్యక్తి మీటర్ రీడింగ్‌కు 10 అంకెలను జోడించాడు ఇది రూ. 86 లక్షలు బిల్లుకు దారితీసింది. అధికారులు వచ్చి బిల్లును సవరించి రూ. 1,540 బిల్లును ఇచ్చారు.