ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) వారణాసి(Varanasi) నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా బరిలో ఎవరూ ఉండకుండా కుట్రలు జరుగుతున్నాయని జ్యోతిర్‌మఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి(Swami Avimukteshwaranand Saraswati) ఆరోపిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) వారణాసి(Varanasi) నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా బరిలో ఎవరూ ఉండకుండా కుట్రలు జరుగుతున్నాయని జ్యోతిర్‌మఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి(Swami Avimukteshwaranand Saraswati) ఆరోపిస్తున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామనుకున్నవారిని వారణాసి మేయర్ బెదిరిస్తున్నారట! నామినేషన్ దాఖలు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు స్వామి చెబుతున్నారు.నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని అర్ధరాత్రి పూట అభ్యర్థుల ఇళ్ల తలుపులు కొడుతున్నారని మండపడ్డారు. ప్రస్తుతం వారణాసిలో భయానక వాతావరణం ఉందని ఆయన వాపోయారు. అసలు దేశంలో ప్రజాస్వామ్యం కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.మొన్నటికి మొన్న కారణాలు చెప్పకుండానే ప్రముఖ కమెడియన్ శ్యామ్ రంగీలా(Shyam Rangeela) నామినేషన్ను తిరస్కరించింది ఎన్నికల సంఘం. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 43 నామినేషన్లు వస్తే వివిధ కారణాలతో 36 నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ప్రస్తుతం మోదీకి పోటీగా ఆరుగురు మాత్రమే బరిలో ఉన్నారు.