మణిపూర్‌లో కుల-కలహాల హింసాకాండ ఆగేలా లేదు. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన తాజా హింసాకాండలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు.

మణిపూర్‌(Manipur)లో కుల-కలహాల హింసాకాండ(Violence) ఆగేలా లేదు. బిష్ణుపూర్(Bishnupur) జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన తాజా హింసాకాండలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు క్వాక్తా ప్రాంతానికి చెందిన మెయిటీ(Meitei) కమ్యూనిటీకి చెందినవారు. ఈ ఘటనల్లో హత్యలే కాకుండా.. కుకీ(Kuki) వర్గానికి చెందిన పలు ఇళ్లను తగులబెట్టడం జరిగింది.

దుండగులు హింసతో పాటు పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. మెయిటీ కమ్యూనిటీకి చెందిన బఫర్ జోన్‌(Buffer Zone)ను దాటి పలువురు వ్యక్తులు అక్కడికి ప్రవేశించి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బిష్ణుపూర్‌లోని క్వాక్తా(Kwakta) ఏరియా అంతటా బఫర్ జోన్‌ను ఏర్పాటు చేశారు.

ముందురోజు కూడా బిష్ణుపూర్‌లో దాడి జరిగింది. దుండగులు ఇండియా రిజర్వ్ బెటాలియన్ (IRB) బెటాలియన్ ప్రధాన కార్యాలయంలోకి చొరబడి ఆయుధాలను దొంగిలించారు. దాదాపు 19,000 రౌండ్ల మందుగుండు సామాగ్రి.. దాడి రైఫిల్స్‌తో పాటు దొంగిలించబడ్డాయి.

దుండగులను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు కూడా పలు రౌండ్లు కాల్పులు జరిపాయి. అయితే, దుండగులు జరిపిన దాడిలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దీంతో పోలీసులు(Police) టియర్ గ్యాస్(Tear Gas) షెల్స్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన తర్వాత ఇంఫాల్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ(Curfew) సడలింపును ఉపసంహరించుకున్నారు.

Updated On 4 Aug 2023 11:51 PM GMT
Yagnik

Yagnik

Next Story