వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో(Ayodhya) రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం(Kumbhabhishekam) జరగబోతోంది. ఆ రోజు మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకోబోతోంది. అయోధ్య పరిసర ప్రాంతాల్లోని దాదాపు 15 గ్రామాల్లో నివసిస్తున్న లక్షా 50 వేల మంది సూర్య వంశ క్షత్రీయులు ఐదు శతాబ్దాల తర్వాత తొలిసారి చెప్పులు(Sandals), తలపాగాలు(Turbans) ధరించబోతున్నారు.

Suryavanshi Kshatriya community
వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో(Ayodhya) రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం(Kumbhabhishekam) జరగబోతోంది. ఆ రోజు మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకోబోతోంది. అయోధ్య పరిసర ప్రాంతాల్లోని దాదాపు 15 గ్రామాల్లో నివసిస్తున్న లక్షా 50 వేల మంది సూర్య వంశ క్షత్రీయులు ఐదు శతాబ్దాల తర్వాత తొలిసారి చెప్పులు(Sandals), తలపాగాలు(Turbans) ధరించబోతున్నారు. ఇస్లామియరాజు హయాంలో రామజన్మ భూమి ఆలయాన్ని కూల్చినప్పుడు.. సాహసోపేతంగా పోరాడిన ఈ సూర్యకుల క్షత్రీయవంశ సైనికులు చాలా బాధపడ్డారట.
మళ్లీ అదే స్థలంలో రామమందిరం నిర్మించే వరకు తలపాగాలు, చెప్పులు, గొడుగులు ధరించబోమని ప్రతిజ్ఞ చేశారట. తమ పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి, గత ఐదు శతాబ్దాలుగా సూర్య వంశ క్షత్రీయులు వివాహ సందర్భాలలో కూడా చెప్పులు, తలపాగా గొడుగు ధరించకుండా జీవిస్తున్నారట. ఇప్పుడు అన్ని గ్రామాల్లో సూర్యవంశ క్షత్రియులకు జనవరి 22న ధరించేందుకు కొత్త తలపాగా తయారు చేసి గ్రామాలవారీగా పంపిణీ చేస్తున్నారు.
