ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయంలో(Ayodhya Ram mandir) శ్రీరామనవమి వేడుకలు(Sri Ramanavami) అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత తొలి సారి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాములవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

Surya Tilak On Ram Lalla
ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయంలో(Ayodhya Ram mandir) శ్రీరామనవమి వేడుకలు(Sri Ramanavami) అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత తొలి సారి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాములవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై కనిపించిన సూర్యతిలకంతో(Sun Rays) భక్తులు పులకించిపోయారు. అధునాతన సాంకేతిక సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదిటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ప్రసరించడంతో ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు రామనామ జపంతో ప్రాంగణాన్ని మర్మోగించారు.
అయోధ్య రామాలయంలో మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపించింది. బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రతి ఏటా సూర్యకిరణాలు ఒకే దగ్గర పడవన్న ప్రశ్నలు రావడంతో.. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే టెక్నాలజీ తరహాలో గేర్ టీత్ మెకానిజం వినియోగించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్పల్పంగా కదుపుతూ ఉంటుంది. ఈ అద్దం శ్రీరామ నవమి నాడు అనుకున్న రీతిలో కాంతిని తీసుకువస్తుందని అధికారులు తెలిపారు.
