'మోదీ ఇంటిపేరు' కేసులో దోషిగా నిర్ధారించినందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సూరత్‌లోని కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. 'మోదీ ఇంటిపేరు'పై ఆయన చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసులో అతనిపై విధించిన శిక్షపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

'మోదీ ఇంటిపేరు' కేసు(Modi Surname Case)లో దోషిగా నిర్ధారించినందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దాఖలు చేసిన పిటిషన్‌పై సూరత్‌లోని కోర్టు(Surat Court) నేడు తీర్పు వెలువరించనుంది. 'మోదీ ఇంటిపేరు'పై ఆయన చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసులో అతనిపై విధించిన శిక్షపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ పరువు నష్టం కేసులో కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడంతో ఈ శిక్ష పడింది. అయితే, ఈ శిక్షపై రాహుల్ అప్పీల్ చేయడంతో ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రాహుల్ గాంధీ వయనాడ్(Wayanad) లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అయితే కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించడంతో అనర్హత వేటు పడింది.
అనంత‌రం కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్(Bail) మంజూరు చేసింది. తన శిక్ష‌ను నిలుపుదల చేయాలని కోరిన‌ రాహుల్ గాంధీ అభ్యర్థనపై కూడా ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీ(Purnesh Modi), రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం(Court) ఏప్రిల్ 20కి తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ విషయం 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. రాహుల్ గాంధీ 'మోదీ' ఇంటిపేరును ఉపయోగించి చేసిన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 2019లో కర్ణాటక(Karnataka)లోని కోలార్‌(Kolar)లో జరిగిన ర్యాలీలో ప్ర‌సంగిస్తూ.. దొంగలందరూ మోదీ తమ ఇంటిపేరుగా ఎలా కలిగి ఉన్నారని.. రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఈ కేసులో రాహుల్ గాంధీపై గుజరాత్(Gujarat) కు చెందిన‌ పూర్ణేష్ మోదీ పరువునష్టం కేసు దాఖలు చేయడంతో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. మోదీతో పాటు మొత్తం ఓబీసీ వర్గానికి వ్యతిరేకంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలుగా బీజేపీ ఎదురుదాడి చేసింది.

Updated On 19 April 2023 11:04 PM GMT
Yagnik

Yagnik

Next Story