బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)కు బెయిల్(Bail) వస్తుందనే నమ్మకంతో ఉన్నారు నేతలు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)కు బెయిల్(Bail) వస్తుందనే నమ్మకంతో ఉన్నారు నేతలు. కోర్టుల్లో బెయిల్‌ కోసం కవిత చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. అయితే ఇవాళ మరోసారి కవిత బెయిల్‌ పిటిషన్‌పైన ఇవాళ విచారణ జరుగనుంది. ఎమ్మెల్సీ క‌విత త‌ర‌ఫున సుప్రీంకోర్టు సీనియ‌ర్ కౌన్సిల్(Supreme court council), మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీ (Mukul Rohatgi)వాదిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన కవితను హైదరాబాద్‌(Hyderabad)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేసింది. మార్చి 16వ తేదీన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court)లో హాజరు పరిచింది. కోర్టు అనుమతితో రెండు విడతలుగా పది రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంలో మార్చి 26న తీహార్‌ జైలుకు తరలించారు. తర్వాత ఈ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. కవిత తీహార్‌ జైలు(Thihar Jail)లో ఉండగానే అరెస్టు చేసింది. అప్పటి నుంచి కవిత బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా కేటీఆర్‌(KTR) ముకుల్‌ రోహత్గీతో చర్చలు జరిపారు. రోహత్గీ సలహా మేరకే సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. అలాగే కింద కోర్టుల్లో ఉన్న ఇతర పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోర్టుకు కవిత విన్నవించుకున్నారు. మధ్యంతర బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విన్నవించుకుంది. కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి అని, ఆమెకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందనేది ఈడీ వాదన. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందంటూ కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు దీనిపై విచారణ జరగనుంది. కవితకు బెయిల్‌ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు. కేటీఆర్‌ కూడా కవితకు బెయిల్ వస్తుందనే ఆశిస్తున్నామన్నారు. చూద్దాం ఏమవుతుందో!

ehatv

ehatv

Next Story