బీజేపీ(BJP) యేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు(Governors) ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం. గవర్నర్ల వ్యవహారశైలిపై పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే పలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు(Supreme court) తీవ్రంగా మండిపడింది.

బీజేపీ(BJP) యేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు(Governors) ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం. గవర్నర్ల వ్యవహారశైలిపై పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే పలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు(Supreme court) తీవ్రంగా మండిపడింది. ఆయా ప్రభుత్వాలు అసెంబ్లీలో(Assembly) ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడంలో గవర్నర్‌లు చేస్తున్న జాప్యంపై మండిపడింది. మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారంటూ గవర్నర్లను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌(D.Y chnadrachood) నేతృత్వంలోని ధర్మాసనం పంజాబ్‌, తమిళనాడు గవ్నర్ల తీరును తప్పుపట్టింది. ‘ఎన్నికైన ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను దయచేసి ఆలస్యం చేయవద్దు' అని సుప్రీంకోట్టు తెలిపింది. ఇది ఆందోళన కలిగించే తీవ్రమైన విషయమని, మీరు నిప్పుతో ఆడుకుంటున్నారు అని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. బిల్లుల విషయంలో పంజాబ్‌ గవర్నర్‌ తీరుపట్ల తాము సంతోషంగా లేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఇష్టానుసారం బిల్లులు క్లియర్‌ చేస్తామని గవర్నర్‌ ఎలా చెబుతారు? పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం కొనసాగించడంలేదా?’ అని
సుప్రీంకోర్టు ప్రశ్నించింది. భారతదేశం ఏర్పాటు నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలు, నియమ నిబంధనలను గవర్నర్లు అనుసరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్ట చేసింది.

Updated On 10 Nov 2023 6:22 AM GMT
Ehatv

Ehatv

Next Story