స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ఆమోదం కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.

Supreme Court Verdict Today On Same Gender Marriage
స్వలింగ సంపర్కుల వివాహాని(Same Gender Marriage)కి చట్టపరమైన ఆమోదం కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం తీర్పు(Verdict) వెలువరించనుంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల విచారణ అనంతరం మే 11న తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ కేసును 21 మంది పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి(Abhishek Manu Singhvi), రాజు రామచంద్రన్(Raju Ramachandran), కెవి విశ్వనాథన్(KV Vishwanathan) (ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి), ఆనంద్ గ్రోవర్(Anandh Grover), సౌరభ్ కిర్పాల్(Saurabh Kirpal) వాదించారు. పిటిషనర్ల అభ్యర్థనను అనుమతించడం వ్యక్తిగత చట్టాలపై ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది.
రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐ చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్(Sanjay Kishan Kaushal), జస్టిస్ ఎస్ రవీంద్ర భట్(Raveendra Bhat), జస్టిస్ హిమా కోహ్లీ(Hima Kohli), జస్టిస్ పీఎస్ నరసింహ(PS Narasimha) ఉన్నారు.
