సీఎం వైఎస్ జగన్(YS Jagan) కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణం రాజు(Raghurama Krishnam Raju) దాఖలు చేసిన పిటిషన్ పై శుక్ర‌వారం సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జ‌రిగింది. ఈ కేసులో సీబీఐ(CBI) సహా ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం.. మీరు ఫిర్యాదుదారు కాదు

సీఎం వైఎస్ జగన్(YS Jagan) కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణం రాజు(Raghurama Krishnam Raju) దాఖలు చేసిన పిటిషన్ పై శుక్ర‌వారం సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జ‌రిగింది. ఈ కేసులో సీబీఐ(CBI) సహా ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం.. మీరు ఫిర్యాదుదారు కాదు.. బాధితులు కాదు కదా అని రఘురామకృష్ణం రాజును ప్రశ్నించింది. ఫిర్యాదుదారు కానప్పటికీ పిటీషన్ దాఖలు చేయవచ్చని ఎంపీ రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది రాజకీయం కోసం వేసిన పిటిషన్ అని సుప్రీం వ్యాఖ్యానించింది. పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి కూడిన‌ ధర్మాసనం కేసు తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని.. విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణం రాజు సుప్రీంలో దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌లో పేర్కొన్నారు

Updated On 3 Nov 2023 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story