జల్లికట్టుకు(Jallikattu) అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు(Supreme Court).
తమిళనాడు ప్రజలు ఆత్మగౌరవ ప్రతీకగా భావించే జల్లికట్టుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జల్లికట్టును అనుమతించే తమిళనాడు ప్రభుత్వ చట్టాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. జల్లికట్టు తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో భాగమని శాసనసభ ప్రకటించినప్పుడు, న్యాయవ్యవస్థ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని తెలపదని వ్యాఖ్యానించింది. ఇది క్రీడా సాంస్కృతిక వారసత్వంలో భాగమని, సంప్రదాయ క్రీడ కాదని చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. జట్టికట్టు పోటీలపై ఎలాంటి నిషేధం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. జంతువులతో కూడిన క్రీడలను అనుమతించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ఇలాంటి చట్టాలను అత్యన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. కాగా 2017లో జల్లికట్టును అనుమతిస్తూ చట్టం తమిళనాడు ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ సవరణల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది.