ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi liquor scam case) అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) ఊరట లభించింది. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) పార్టీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు(supreme court) మధ్యంతర బెయిల్(Interim bail) మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ వరకు కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

కేజ్రీవాల్‌కు జూన్ 5వ తేదీ వరకు, అంటే ఎన్నికల ఫలితాల మరుసటి రోజు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. జూన్ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని పేర్కొంది. బెయిల్ నిబంధనలను ఆయన తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించగా కోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఎన్నికల ప్రచారం(Election Campaign) కారణంతో ఆయనను విడుదల చేయడం సరికాదని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ‘ఏడాదిన్నర నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. కానీ మార్చిలో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ 21 రోజులు ఆయనకు బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏం ఉండదు’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇది అసాధారణ పరిస్థితి అని, కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రి అని, ఆయన అలవాటు పడిన నేరస్థుడు కాదని న్యాయస్థానం తెలిపింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వద్దని ప్రశ్నించింది.