ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై(Petition) ఎల్లుండి విచారించనుంది సుప్రీంకోర్టు(Supreme Court). తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ, సుప్రీంకోర్టులో గతంలో వేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగానే ఈడీ అరెస్ట్ చేసిందని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై(Petition) ఎల్లుండి విచారించనుంది సుప్రీంకోర్టు(Supreme Court). తనను ఈడీ(ED) అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ, సుప్రీంకోర్టులో గతంలో వేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగానే ఈడీ అరెస్ట్ చేసిందని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. కవిత వేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. ఈ పిటిషన్‌లో ఈడీని కవిత ప్రతివాదిగా చేర్చారు. మరోవైపు లిక్కర్ కేసులో కవితను ఈడీ విచారిస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. తన తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమణులు అఖిల సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్‌ను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది.