దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో(Bilkis Bano) రేపిస్టులను ఎందుకు విడుదల చేశారంని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశ్నించింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకోరా అంటూ నిలదీసింది. గుజరాత్ ప్రభుత్వం(Gujarat Govt)పై మండిపడింది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టిన గుజరాత్ ప్రభుత్వాన్ని తిట్టిపోసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో(Bilkis Bano) రేపిస్టులను ఎందుకు విడుదల చేశారంని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశ్నించింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకోరా అంటూ నిలదీసింది. గుజరాత్ ప్రభుత్వం(Gujarat Govt)పై మండిపడింది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టిన గుజరాత్ ప్రభుత్వాన్ని తిట్టిపోసింది. బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆమె కుటుంబంలో ఏడుగురిని హత్య చేసిన 11 మందిని ఎందుకు విడుదల చేశారో స్పష్టం చేయాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ఇవాళ బిల్కిస్ బానోకు జరిగింద, రేపు ఇంకెవరికైనా జరగొచ్చు. అది మీరైనా కావొచ్చు. నేనైనా కావొచ్చు..అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేసు తీవ్రత ఏమిటో పట్టించుకోరా? మీరు అసలు మనసుపెట్టి చూశారా?’ అంటూ గుజరాత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒక గర్భవతిని గ్యాంగ్ రేప్(Gang rape) చేశారు. మరికొందరిని చంపేశారు. అలాంటప్పుడు ఈ కేసును సాధారణమైన కేసుగా పోల్చడానికి వీలులేదు. బత్తాయిలను యాపిల్ పండ్లతో ఎలా పోల్చలేరో ఒక్క హత్య కేసుతో సామూహిక హత్యలను కూడా అలా పోల్చలేరు అని సుప్రీం స్పష్టం చేసింది. సాధారణంగా సమాజానికి, కమ్యూనిటీకి వ్యతిరేకంగా నేరాలు జరుగుతుంటాయి. సమానతలను సమానంగా చూడలేము అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రెమిషన్ ఇవ్వడానికి గల కారణాలను చూపించకపోతే, ఫైల్స్ సమర్పించకపోతే న్యాయవ్యవస్థ తన సొంత తీర్మానాన్ని తీసుకోవలసి ఉంటుందని అని గుజరాత్ ప్రభుత్వానికి తెలిపింది. దోషులను ముందుగానే పెరోల్‌పై విడుదల చేయడానికి కారణాలను జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం ప్రశ్నించింది. ఖైదులో ఉన్నవారిపై దయ చూపేముందు వారు చేసిన నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలి కదా అని వ్యాఖ్యానించింది. ‘‘రికార్డులను చూడండి. ఒకరికి 1,000 రోజులు, మరొకరికి 1,200 రోజులు, ఇంకొకరికి 1,500 రోజులు చొప్పున పెరోల్ ఇచ్చారు. ఇదేమీ సాదాసీదా సెక్షన్ 302 (హత్య) కేసు కాదు. ఇది సామూహిక అత్యాచారంతో ముడిపడిన హత్యల కేసు' అని సుప్రీం పేర్కొంది. కేసుకు సంబంధించిన అసలైన దస్త్రాలను సమర్పించకపోవడాన్ని ధిక్కరణగా పరిగణిస్తాం. వాటిని చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సిగ్గు పడుతోంది?’ అని ధర్మాసనం.. ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజును ప్రశ్నించింది.ఇదిలా ఉంటే బిల్కిస్ బానో రేపిస్టుల విడుదలక సంబంధించిన ఫైల్స్ సమర్పించాలంటూ సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలపై సమీక్షకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలు కోరాయి. ప్రతివాదులు తమ అభిప్రాయాలను మే ఒకటో తేదీలోగా దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆ మరుసటి రోజుకు వాయిదా వేసింది.