Margadarshi Chit Fund Case : సుప్రీంకోర్టులో మార్గదర్శికి చుక్కెదురు
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులు(Margadarshi chit fund cases) తెలంగాణకు(Telangana) బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు(supreme court) తిరస్కరించింది. మార్గదర్శి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవి కనిపించడం లేదని సుప్రీం కోర్టు భావించింది.
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులు(Margadarshi chit fund cases) తెలంగాణకు(Telangana) బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు(supreme court) తిరస్కరించింది. మార్గదర్శి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవి కనిపించడం లేదని సుప్రీం కోర్టు భావించింది. మార్గదర్శి పిటిషన్లను అనుమతించే ప్రసక్తే లేదని తెలిపింది. కేసు విచారణపై స్టే కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టునే ఆశ్రయించమని సూచించింది. కేసును కొట్టివేస్తే పటిషన్లన్నీ నిరర్థకమే కదా అని వ్యాఖ్యానించింది. ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే(AP High court) తగిన పిటిషన్ వేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.