తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మెడకు మరో కేసు బిగిసేలా ఉంది.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మెడకు మరో కేసు బిగిసేలా ఉంది. కవిత(Kavitha)కు సుప్రీంకోర్టులో బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్టులపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్(Telangana Congres Twitter),వాట్సప్ గ్రూపుల్లో కవిత బెయిల్(Kavitha Bail) అంశంపై వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సీరియస్‌గా పరిగణించింది. కవితకు బెయిల్ వచ్చిందా..? ఇచ్చారా ? ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి పోస్టులు వెలువడ్డాయి. 'కమలంతో స్నేహం..తైతక్కకు మోక్షం' అని తెలంగాణ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. పీసీసీగా రేవంత్ రెడ్డి(PCC Revanth Reddy) ఉన్నందున కవిత బెయిల్ పై వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా కవిత బెయిల్‌ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా గతంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధంగా సీఎం హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతారా అని సీరయసైంది. రాజకీయనేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మేం నిర్ణయాలు తీసుకోవాలా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం తెల్సిందే. దీనిపై రేవంత్‌రెడ్డి కూడా స్పందించి, సుప్రీంకోర్టు(Supreme Court)కు క్షమాపణలు చెప్పారు. న్యాయవ్యవస్థపై తనకు అపారగౌరవం ఉందంటూ ట్వీట్ చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులకుగాను సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ehatv

ehatv

Next Story