పతంజలి(Patanjali) ఆయుర్వేద నిర్వాహకులు రాందేవ్‌ బాబా(Ramdev Baba), బాలకృష్ణలను(Balakrishna) సుప్రీంకోర్టు మరోసారి ఘాటుగా తిట్టేసింది. బాబా రాందేవ్‌ అంత అమాయకుడేం కాదని సీరియస్‌ అయ్యింది. ఆయనది ముమ్మాటికి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనేనని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పతంజలి(Patanjali) ఆయుర్వేద నిర్వాహకులు రాందేవ్‌ బాబా(Ramdev Baba), బాలకృష్ణలను(Balakrishna) సుప్రీంకోర్టు మరోసారి ఘాటుగా తిట్టేసింది. బాబా రాందేవ్‌ అంత అమాయకుడేం కాదని సీరియస్‌ అయ్యింది. ఆయనది ముమ్మాటికి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనేనని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసును జస్టిస్‌ హిమా కోహ్లి(Hima Kohli), జస్టిస్‌ ఏ అమానుల్లాతో కూడిన సుప్రీకోర్టు ధర్మాసనం విచారించింది బాబా రాందేవ్, బాలకృష్ణ ఇద్దరూ సుప్రీకోర్టు విచారణకు హాజరయ్యారు. ‘మేము చేసిన తప్పిదాలకు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఆ సమయంలో మేము చేసింది సరైంది కాదు. మేము చేసిన తప్పును భవిష్యత్తులో కూడా మళ్లీ జగరకుండా గుర్తు పెట్టుకుంటాము' అని బాబా రాందేవ్‌ కోర్టుకు తెలిపారు. దానికి సుప్రీంకోర్టు(Supreme Court) రియాక్టయ్యింది ‘చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. మీరు ఏమి చేసినా అది మీ బాధ్యత మాత్రమే. మా ఆదేశాలను అనుసరించి క్షమాపణలు చెప్పారు. నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చేయలేరని మీకు తెలియదా? అని ప్రశ్నించింది. తాము అనేక పరీక్షలు చేశామని రాందేవ్‌ బాబా కోర్టుకు తెలిపారు. 'మీ ప్రవర్తన అసలు బాగోలేదు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. మీ క్షమాపణలు ఆమోదించాలా? వద్దా? అనే అంశంపై మేము ఆలోచిస్తాం. మీరు పదేపదే మా ఆదేశాలు ఉల్లంఘించారు’ అని జస్టిస్‌ హిమా కోహ్లి సీరియస్‌ అయితే, మీ క్షమాపక్షణలు హృదయం నుంచి రావటం లేదని మరో న్యామమూర్తి జస్టిస్‌ ఏ అమానుల్లా అన్నారు. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం ఏప్రిల్‌ 23వ తేదీకి వాయిదా వేసింది.

Updated On 16 April 2024 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story