రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్(Brij Bhushan Sharan Singh)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. అయినా పోలీసులు మాత్రం బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. కారణం ఈయన బీజేపీ ఎంపీ(BJP MP) కాబట్టి. ఇక లాభం లేదనుకున్న ఏడుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court) తలుపు తట్టారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్(Brij Bhushan Sharan Singh)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. అయినా పోలీసులు మాత్రం బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. కారణం ఈయన బీజేపీ ఎంపీ(BJP MP) కాబట్టి. ఇక లాభం లేదనుకున్న ఏడుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court) తలుపు తట్టారు. రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై.చంద్రచూడ్(DY. Chandrachud), జస్టిస్ పి.ఎస్.నరసింహ(Justice P.S. Narasimha)లతో కూడిన ధర్మాసనం రెజ్లర్లు చేసిన తీవ్రమైన ఆరోపణలను పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు(Delhi police) మరియు ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt) నుండి ప్రతిస్పందన కోరింది.
లైంగిక వేధింపులపై వీడియో రికార్డింగ్‌లు ఉన్నా, ఏడుగురు మహిళలు వేధింపులకు గురయ్యారన్నా ఆధారాలు ఉన్నా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు పోలీసులను సైతం ప్రాసిక్యూట్ చేయాలని సూచించింది. మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతే కాదు వాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎందుకు కేసు నమోదు చేయలేదో తమకు నివేదించాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు జ్యూడిషియల్ రికార్డుల నుండి ఆ ఏడుగురు బాధిత రెజ్లర్ల పేర్లను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
ఈ ఏడాది జనవరిలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డు మీదకు వచ్చారు. జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టారు. బ్రిజ్ భూషణ్ పై ప్రపంచ చాంపియన్ షిప్ పతక విజేత, ఒలింపియన్ వినేశ్ ఫోగట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. లక్నోలోని నేషనల్ క్యాంప్ లో పలువురు కోచ్ లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని వినేశ్ ఫోగాట్ ఆరోపించారు. వినేశ్ ఫోగాట్ తో పాటు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇంత జరిగినా కేంద్రప్రభుత్వం మాత్రం అతడిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. స్టార్ రెజ్లర్ల్ మేరీ కోమ్ నేతృత్వంలో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసిందంతే. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముందో ఎవరికీ తెలియదు. బయట పెట్టాలంటూ తాజాగా రెజ్లర్లు మరోసారి రోడ్డెక్కారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకునేంత వరకు తాము నిరసన విరమించబోమని చెబుతున్నారు. అప్పటి వరకు అలుపెరగకుండా ధర్నా చేస్తుంటామని అంటున్నారు. మరోవైపు రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో మే 7వ తేదీన జరగాల్సిన రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను క్రీడా మంత్రిత్వ శాఖ నిలిపి వేసింది. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావడం వల్లే ఆయనపై కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.