ఢిల్లీలో(Delhi) సర్వీసుల నియంత్రణ(Regulation of Services), అధికారుల బదిలీ-పోస్టింగ్‌పై(Transfer) కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై(Ordinance) పంచాయితీ స‌ద్దుమ‌ణిగేలా లేదు. తాజాగా ఈ విష‌య‌మై సుప్రీంకోర్టు(supreme court) సోమవారం కేంద్రానికి నోటీసులు(Notice) జారీ చేసింది.

ఢిల్లీలో(Delhi) సర్వీసుల నియంత్రణ(Regulation of Services), అధికారుల బదిలీ-పోస్టింగ్‌పై(Transfer) కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై(Ordinance) పంచాయితీ స‌ద్దుమ‌ణిగేలా లేదు. తాజాగా ఈ విష‌య‌మై సుప్రీంకోర్టు(supreme court) సోమవారం కేంద్రానికి నోటీసులు(Notice) జారీ చేసింది. అధికారుల బదిలీల కోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ.. ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

ఈ విష‌య‌మై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌(DY Chandrachud), జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో(PS Narasimha) కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీని జూలై 17న ఖరారు చేస్తూ ధర్మాసనం.. “మేము నోటీసు జారీ చేస్తాము” అని పేర్కొంది. ఆర్డినెన్స్‌ను రద్దు చేయడంతో పాటు.. దానిపై మధ్యంతర స్టే విధించాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. ఢిల్లీలో గ్రూప్-ఎ అధికారుల బదిలీ, పోస్టింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం మే 19న నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) ఆర్డినెన్స్-2023ని ప్రభుత్వం ప్రకటించింది.

Updated On 10 July 2023 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story