ఎన్నికలలో నోటాకు (NOTA) ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికను నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు(supreme court) విచారణ చేపట్టిది. నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు మళ్లీ అదే నియోజకవర్గంలో అయిదేళ్ల వరకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిల్ విన్నవించుకుంది.
ఎన్నికలలో నోటాకు (NOTA) ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికను నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు(supreme court) విచారణ చేపట్టిది. నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు మళ్లీ అదే నియోజకవర్గంలో అయిదేళ్ల వరకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిల్ విన్నవించుకుంది. నోటాను కల్పిత అభ్యర్థిగా పేర్కొంటూ విస్తృత ప్రచారం కల్పించేలా నిబంధనలు రూపొందించాలని పిల్ కోరింది. వక్త, రచయిత శివ్ ఖేరా(Shiv Khera) దాఖలు చేసిన ఈ పిల్‌పై సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఖేరా తరఫు లాయర్ గోపాల్ శంకర్‌నారాయణ వాదిస్తూ సూరత్‌లో కాంగ్రెస్(Congress) అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో పాటు ఇతర అభ్యర్థులు మ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నిక లేకుండానే బీజేపీ అభ్యర్థి గెలిచారు. సూరత్‌లో మరో అభ్యర్ధి లేనందున, బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. అయితే పోటీలో ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ, ఎన్నికల నిర్వహించాల్సి ఉండాల్సిందని, ఓటరుకి అభ్యర్ధి నచ్చకపోతే నోటాకు ఓటేసేవాడని గోపాల్ శంకర్ నారాయణ్ పేర్కొన్నారు.