పెళ్లప్పుడు(Marriage) పెళ్లి కూతురుకు పుట్టింటివారు తమ తాహతుకు తగినట్టుగా ధన, కనక, వస్తు, వాహనాలను కానుకగా ఇచ్చి అత్తారింటికి పంపుతారు. దాన్ని స్త్రీ ధనం(Dowry) అంటారు.
పెళ్లప్పుడు(Marriage) పెళ్లి కూతురుకు పుట్టింటివారు తమ తాహతుకు తగినట్టుగా ధన, కనక, వస్తు, వాహనాలను కానుకగా ఇచ్చి అత్తారింటికి పంపుతారు. దాన్ని స్త్రీ ధనం(Dowry) అంటారు. ఆ స్త్రీ ధనంపై భర్తకు(Husband) ఎలాంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు(Supreme court) కీలకమైన తీర్పు చెప్పింది. స్త్రీ ధనంపై మొగుడుకు ఎలాంటి నియంత్రణ ఉండదని, కాకపోతే కుటుంబం ఇబ్బందులో పడితే మాత్రం దాన్ని వాడుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే దానిని, లేదా దానికి సరిపడా మొత్తాన్ని భార్యకు తిరిగి ఇచ్చేయాలని, ఆ నైతిక బాధ్యత భర్తదేనని స్పష్టం చేసింది. స్త్రీ ధనమన్నది ఉమ్మడి ఆస్తి కానే కాదని, దానిపై భర్తకు ఎలాంటి ఆధిపత్యం, యాజమాన్య హక్కులు సంక్రమించవని తెలిపింది.