లైంగిక వేధింపులకు(Sexual harrasment) సంబంధించి సుప్రీంకోర్టు(supreme court) మరో సంచలన తీర్పు చెప్పింది.
లైంగిక వేధింపులకు(Sexual harrasment) సంబంధించి సుప్రీంకోర్టు(supreme court) మరో సంచలన తీర్పు చెప్పింది. బాధితురాలు, నిందితుడు రాజీ(Compramise) పడినంత మాత్రాన లైంగిక వేధింపుల కేసు రద్దు(Case dismiss) కాదని సర్వోత్తమ న్యాయస్థానం స్పష్టం చేసింది. పూర్వాపరాల కు వెళితే, రాజస్థాన్‌లో(Rajasthan) ఒక విద్యార్థినిని లైంగికంగా వేధించారంటూ ఉపాధ్యాయునిపై కేసు నమోదు అయ్యింది. నిందితుడు, బాధితురాలు రాజీ పడినందున కేసును రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. రాజస్థాన్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం రద్దు చేస్తూ కేసు కొనసాగవలసిందేనని చెప్పింది.
రాజస్థాన్‌లోని గంగాపూర్ నగరంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న విమల్ కుమార్ గుప్తా ఒక దళిత బాలికను లైంగికంగా వేధించినట్టు పోలీసులు పోక్సో కేసు(POCSO) నమోదు చేశారు. బాలిక స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేశారు. అయితే విచారణ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు స్టాంప్ పేపర్‌పై రాసి ఇచ్చిన పేపర్ ను విమల్ కుమార్ గుప్తా కోర్టుకు సమర్పించాడు.
పొరపాటున తాము ఉపాధ్యాయునిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అతనిపై ఎలాంటి చట్టపరమైన చర్యను తాము కోరుకోవడం లేదని ఆ బాండ్ పేపర్ లో బాధితురాలి తల్లిదండ్రులు రాసిచ్చారు. ఈ పేపర్ ను పోలీసులు కోర్టులో సమర్పించారు. అయితే కింది కోర్టు దానిని తిరస్కరించింది. దాంతో నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. హై కోర్టు దానిని అంగీకరిస్తూ, విమల్ కుమార్ పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త రామ్‌జీ లాల్ బైర్వా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. బాధితులతో రాజీ పడినంత మాత్రాన అతను చేసిన నేరం రద్దయిపోదని తెలిపింది. నిందితుడిపై తిరిగి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ కొనసాగించాలని ఆదేశించింది.