బ్రిటీష్‌(British) కాలం నాటి నుంచి వస్తున్న ఆనవాయితీకి తెరదించారు.

బ్రిటీష్‌(British) కాలం నాటి నుంచి వస్తున్న ఆనవాయితీకి తెరదించారు. బ్రిటీష్‌ కాలం నుంచి న్యాయదేవత(lady justice) కళ్లకు గంతలు కట్టి సమన్యాయం అంటూ చెప్పుకొచ్చారు. కానీ తొలిసారి న్యాయదేవత కళ్లకు గంతలు తీయడంపై ఆసక్తిరేగుతోంది. అంతేకాదు ఖడ్గదారి అయిన న్యాయదేవత ఎడమచేతిలో రాజ్యాంగం(constitution) పెట్టారు. ఇదంతా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో సరికొత్త న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చండ్రుచూడ్‌ ఆదేశాల ప్రకారం న్యాయదేవత కొత్త విగ్రహాన్ని అమర్చారు. చట్టానికి కళ్లు లేవన్న పాత సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారు. న్యాయదేవత కళ్లకు గంతలు తీసేశారు. కళ్లారా చూస్తూ.. సమన్యాయం అందించే న్యాయదేవత ఇప్పుడు తెర మీదకు వచ్చినట్లైంది. అచ్చమైన భారతీయ వనితలా స్వచ్ఛతను స్ఫూర్తికి తెచ్చేలా న్యాయదేవతకు తుదిరూపు ఇచ్చారు. రాజుల కాలం నాటి ఖడ్గంతో తీర్పు ఇస్తున్నట్లు కాకుండా రాజ్యాంగం ప్రకారం తీర్పు ఇస్తున్నట్లు ఉండాలన సీజేఐ సూచనలతో మార్పులు చేపట్టారు. అయితే మరో చేతిలో ఉండే త్రాసును మాత్రం అలాగే ఉంచారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న విషయాన్ని తెలిపే త్రాసును అలాగే ఉంచారు.

Eha Tv

Eha Tv

Next Story