SC Reserve On Chandrababu Petition : చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం
స్కిల్ కేసు(skill Development Case) కొట్టేయాలని కోరుతూ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) రిజర్వ్(Reserve) చేసింది. జస్టిస్ అనిరుద్ధబోస్(Justice Anirudh Bose), జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం.. మంగళవారం పిటిషన్‌పై వాదనలు విన్నది.

SC Reserve On Chandrababu Petition
స్కిల్ కేసు(skill Development Case) కొట్టేయాలని కోరుతూ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) రిజర్వ్(Reserve) చేసింది. జస్టిస్ అనిరుద్ధబోస్(Justice Anirudh Bose), జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం.. మంగళవారం పిటిషన్‌పై వాదనలు విన్నది. గత విచారణకు కొనసాగింపుగా సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అనంతరం చంద్రబాబు తరుపు న్యాయవాది హరీష్ సాల్వే(Harish Salve) వర్చువల్‌గా వాదనలు వినిపించారు. కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని.. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సాల్వే కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు పిటిషన్ పై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అదే రోజు మధ్యంతర బెయిల్ పైనా వాదనలు వినేందుకు అంగీకరించింది. అలాగే ఫైబర్ నెట్ కేసులోనూ మధ్యంతర బెయిల్ పై అదే రోజు వాదనలు వినడంతో పాటు ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
