తిరుమల లడ్డూ(Tirumala laddoo) తయారీకి వాడిన నెయ్యిలో(Ghee) కల్తీ జరిగిందా లేదా అన్నది తేల్చడానికి చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసిన సంగతి తెలిసిందే.

తిరుమల లడ్డూ(Tirumala laddoo) తయారీకి వాడిన నెయ్యిలో(Ghee) కల్తీ జరిగిందా లేదా అన్నది తేల్చడానికి చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసిన సంగతి తెలిసిందే. సోమవారం సుప్రీంకోర్టు(Supreme court) లడ్డూ వ్యవహారంపై విచారణ జరుపుతూ చంద్రబాబుపై అక్షింతలు వేసిన సంగతి కూడా తెలిసిన విషయమే. అయితే తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేయకండా సిట్‌(SIT) దర్యాప్తుపై తెగ హడావుడి చేశాయి. ఇప్పుడు సిట్‌ దర్యాప్తు నిలిపివేసింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో సిట్‌ దర్యాప్తు వాయిదా వేసినట్లు సమాచారం. సిట్‌ను కొనసాగించాలా లేక వేరే సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్న విషయంలో సుప్రీంకోర్టు సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కోరింది. దీంతో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే దాకా సిట్‌ తన దర్యాప్తును నిలిపివేసింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ అయిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీసుబ్బారెడ్డితో పాటు బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఇదిలా ఉంటే నెయ్యి వ్యవహారంపై సిట్‌ మూడు రోజులపాటు దర్యాప్తు చేసింది. కల్తీపై ఫిర్యాదులో జాప్యం ఎందుకు జరిగింది అనే అంశంతో పాటు పలు కీలక సమాచారాలను టీటీడీ అధికారుల నుంచి సిట్‌ రాబట్టింది. టీటీడీ మార్కెటింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది.

Eha Tv

Eha Tv

Next Story