మైనర్ గా ఉన్న తమ కూతురును పెళ్లి చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తల్లితండ్రులు వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

మైనర్ గా ఉన్న తమ కూతురును పెళ్లి చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తల్లితండ్రులు వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. కూతురంటే మీ ఇంట్లో వస్తువు కాదని, ఆమె వివాహానికి అంగీకారం తెలపడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత అని పేర్కొంది. పెళ్లి చేసుకున్నప్పుడు మీ కూతురు మైనర్ కాదని, ఆ పెళ్లి మీకు ఇష్టం లేదు కాబట్టే ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కేసు పెట్టారని, మీ కూతురు భర్తను జైలులో పెట్టే అధికారం మీకు లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా(Sanjeev Khanna), జస్టిస్ సంజయ్ కుమార్(Sanjay kumar) ల కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ' మీ కూతురు మీ సొంత ఆస్తి కాదు. ఆమె ఒక వస్తువు కాదు. ఆమె పెళ్లిని ఒప్పుకోండి ' అని సుప్రీం కోర్టు సూచించింది. పెళ్లి జరిగిన సమయానికి తమ కూతురు మైనర్ అని చెప్పడానికి తల్లి దండ్రుల దగ్గర కచ్చితమైన ఆధారాలు లేవని తెలిపింది. హై కోర్టు ఆదేశాల లో జోక్యం చేసుకోమని పేర్కొంది. తమ కూతురును బంధించి , అత్యాచారం చేశాడంటూ మధ్యప్రదేశ్ లోని మహిద్ పూర్ కు చెందిన ఓ తల్లిదండ్రులు వేసిన పిటిషన్ ను ఆగస్టు 16వ తేదీన మధ్యప్రదేశ్(MP) హై కోర్ట్ ఇండోర్ బెంచ్ కొట్టివేసింది.

ehatv

ehatv

Next Story