మగ 'పురుషులు' కాస్త ఊపిరి పీల్చుకోండి..!

భార్యాభర్తలను విడిపోతున్న సందర్భంగా ఇచ్చే మనోవర్తిపై సుప్రీంకోర్టు (Supreme Court) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మనోవర్తి చెల్లించాల్సిన మొత్తం ఏ భర్తకూ శిక్ష కారాదని, అలాగే భార్య సగౌరవంగా జీవించేలా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. బెంగళూరు టెకీ, భార్యా బాధితుడు అతుల్ సుభాష్ ఆత్మహత్యపై సుప్రీం కోర్టు స్పందించింది. దంపతుల ఆస్తిపాస్తుల వివరాలు.. అత్తారింట్లో భార్య జీవన ప్రమాణాలు ఎలా ఉండేవి.. కుటుంబాన్ని చూసుకోవడానికి ఆమె ఉద్యోగం మానేసిందా అనేది చూడాలని తెలిపింది. మనోవర్తి చెల్లిస్తున్నప్పుడు భర్త ఆర్థిక హోదా, ఆదాయం, ఇతర బాధ్యతలు ఏంటి అన్న కోణంలో ఆలోచించాలని పేర్కొంది. ఇదంతా సులభమైన పని కానప్పటికీ మనోవర్తిపై నిర్ణయాల్లో ఇవి తోడ్పడతాయని సుప్రీంకోర్టు తెలిపింది. భార్యాభర్తల ఆర్థిక, సామాజిక హోదా పరిశీలించాలని.. భవిష్యత్తులో భార్య, పిల్లల అవసరాల దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించింది. భార్యాభర్తలిద్దరి విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు పరిశీలించాలని పేర్కొంది.

ehatv

ehatv

Next Story