Supreme court On Rushikonda Petition : హైకోర్టులోనే తేల్చుకోండి.. రుషికొండపై సుప్రీంకోర్టు తీర్పు
టీడీపీ(TDP) నేత లింగమనేనికి(Lingamaneni) సుప్రీంకోర్టులో(Supreme Court) ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణాల(Rushikonda constructions) అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లవద్దని అంటున్నారు. ఇందులో
లింగమనేని శివరామ ప్రసాద్ కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
టీడీపీ(TDP) నేత లింగమనేనికి(Lingamaneni) సుప్రీంకోర్టులో(Supreme Court) ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణాల(Rushikonda constructions) అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లవద్దని అంటున్నారు. ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉంది. రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రుషికొండపై నిర్మాణాలు అక్రమం అని, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంంలో లింగమనేని శివరామ ప్రసాద్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. హైకోర్టులో(High Court) రుషికొండ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే పిల్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం వెల్లడించారు. పిటీషన్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని సుప్రీం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేశారు. కోస్టల్ రెగ్యులేటరీ జోనుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫైనల్ హియరింగ్ ఉండగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విశాఖపట్నం రుషి కొండ మీద ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం ఏపీ సర్కార్ అక్టోబర్ 11, 2023న ఇచ్చిన జీవో 2015ను వెంటనే రద్దు చేయాలనీ కోరుతూ సుప్రీమ్ కోర్టులో లింగమనేని శివరామ ప్రసాద్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/ఏ ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిటేషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఎన్జీటీ, ఏపీ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు రుషికొండపై ఏ విధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లింగమనేని శివరామ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే పిల్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం స్పందించారు.