ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి(Patanjali) ప్రకటనలపై సుప్రీంకోర్టు(Supreme court) మండిపడింది. తప్పుదోవ పట్టిస్తున్న పతంజలి ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చున్నదని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనల విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి(Patanjali) ప్రకటనలపై సుప్రీంకోర్టు(Supreme court) మండిపడింది. తప్పుదోవ పట్టిస్తున్న పతంజలి ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చున్నదని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనల విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పతంజలి తప్పుడు ప్రకటనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ కేంద్రం తరఫు న్యాయవాదిని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌కు(Baba Ramdev) చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ గత పదేళ్లలో బాగా అభివృద్ధి చెందింది. కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం అండదండలు పతంజలికి పుష్కలంగా ఉన్నాయి. హెర్బల్ ఉత్పత్తులపై మోసపూరిత ప్రకటనలు చేస్తూ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్న పతంజలి ఆయుర్వేద సంస్థను ఇంతకు ముందే సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంపెనీ చేస్తున్న నిరాధారమైన, మోసపూరితమైన ప్రకటనలను ఆపేయాలని, లేకపోతే ఆ సంస్థ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు..ఆ ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అయినా పతంజలి లైట్ తీసుకున్నారు. తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయంటూ పతంజలి కంపెనీ అడ్వర్‌టైజ్ చేసుకుంటూ వస్తున్నది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు వైద్యులను కించపరిచేలా ఉన్నాయని పిటీషన్‌లో పేర్కొంది. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే వైద్యులను కించపరిచేలా, నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులను, ఆ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పతంజలి సంస్థ వైద్యులను కించపరిచేలా వ్యవహరించటం మంచిది కాదని ధర్మాసనం సూచించింది. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఇలాంటి ప్రకటనలను నిలిపివేయాలని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది.