2021లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి)లో ప్రచురితమైన డేటాను ఉటంకిస్తూ, ఆ ఏడాది దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని న్యాయవాది మహేష్ కుమార్ తివారీ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. వీరిలో 81,063 మంది వివాహిత పురుషులు కాగా, 28,680 మంది వివాహిత మహిళలు ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు.

గృహహింసకు గురై వివాహితలు ఆత్మహత్య చేసుకోవడంతోపాటు వారి ప్రయోజనాలను కాపాడేందుకు 'నేషనల్ కమిషన్ ఫర్ మెన్'(National Commission for Men)ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిల్ను జూలై 3న సుప్రీంకోర్టు విచారించనుంది.

సుప్రీంకోర్టు వెబ్సైట్ ప్రకారం, న్యాయమూర్తులు సూర్యకాంత్(Suryakanth) , దీపాంకర్ దత్తాలతో(Dipankar Datta) కూడిన ధర్మాసనం పిల్ సోమవారం విచారణ చేపట్టనుంది

2021లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB)లో ప్రచురితమైన డేటాను ఉటంకిస్తూ, ఆ ఏడాది దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని న్యాయవాది మహేష్ కుమార్ తివారీ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. వీరిలో 81,063 మంది వివాహిత పురుషులు కాగా, 28,680 మంది వివాహిత మహిళలు ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు.

"2021 సంవత్సరంలో 33.2 శాతం మంది పురుషులు కుటుంబ సమస్యల కారణంగా, 4.8 శాతం మంది వివాహ సంబంధిత సమస్యల కారణంగా తమ జీవితాలను ముగించారని . ఇదే సంవత్సరంలో 1,18,979 మంది పురుషులు (72 శాతం) 45,026 మంది మహిళలు (27 శాతం) ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్సిఆర్బి అందించిన డేటాను ప్రస్తావిస్తూ పిటిషనర్ పేర్కొన్నారు.

వివాహితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గృహ హింసకు గురవుతున్న వారి ఫిర్యాదులను స్వీకరించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు.

"గృహ హింస బాధితుల ఫిర్యాదును స్వీకరించడానికి ప్రతి పోలీస్ స్టేషన్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్కు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా సరైన మార్గదర్శకాలను జారీ చేయడానికి ప్రతివాది నెం.1 (Union Of India)కి ఆదేశాలు జారీ చేయండని పిటిషనర్ పేర్కొన్నారు.

"గృహ హింస లేదా కుటుంబ సమస్యలు, వివాహ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యపై పరిశోధన చేయడానికి ఒక జాతీయ ఫోరమ్ను ఏర్పాటు చేయడానికి అవసరమైన నివేదికను రూపొందించడానికి లా కమిషన్ ఆఫ్ ఇండియాకు దిశానిర్దేశం / సిఫార్సును జారీ చేయండి అని పిటిషన్లో పేర్కొంది.

Updated On 1 July 2023 5:35 AM GMT
Ehatv

Ehatv

Next Story