Supreme Court : చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. హైకోర్టు తీర్పును సవరించిన సుప్రీం
చంద్రబాబుకు(Chandrababu) సుప్రీం కోర్టులో(Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. బాబు బెయిల్(Bail) రద్దు చేయాలని ఏపీ సీఐడీ(AP CID) వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బేలా ఎం త్రివేది(Bela M Trivedi), జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో(Satish Chandra Sharath) కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ జరిపింది. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. గతంలో ఎలాంటి షరతులు లేవని..
చంద్రబాబుకు(Chandrababu) సుప్రీం కోర్టులో(Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. బాబు బెయిల్(Bail) రద్దు చేయాలని ఏపీ సీఐడీ(AP CID) వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బేలా ఎం త్రివేది(Bela M Trivedi), జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో(Satish Chandra Sharath) కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ జరిపింది. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. గతంలో ఎలాంటి షరతులు లేవని..హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించింది. చంద్రబాబుకు బెయిల్ షరతులు విధిస్తూ ఆదేశాలిచ్చింది. చంద్రబాబు బెయిల్ షరతులు పాటించాల్సిందేనని పేర్కొంది. కేసుకు సంబంధించిన అంశాలు.. మీడియాలో బహిరంగంగా మాట్లాడొద్దని సూచించింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ డిసెంబర్ 11కి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకూ షరతులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.