ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. మే 3న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ తరపు న్యాయవాది సింఘ్వీ అన్నారు. దర్యాప్తు సంస్థ ముందు హాజరుకాకపోవడం అరెస్టుకు ఆధారం కాదు అని వాదించారు.
ఇది ఎన్నికల సమయం కాబట్టి కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్టు స్వయంగా గత విచారణలో చెప్పడం గమనార్హం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మా వాదన కూడా వినాలని ఈడీ చెప్పింది. ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టులో ఈడీ వాదనలు వినిపిస్తుంది.