వైద్య విద్య‌లో ప్రవేశాల కోసం నిర్వ‌హించే నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ క‌మ్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ అండ‌ర్ గ్రాడ్యుయేట్ (NEET UG) పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supeme Court) మంగళవారం విచారించింది. జస్టిన్‌ విక్రమ్‌ నాథ్‌(Justice), జస్టిస్‌ అమనుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపింది.

వైద్య విద్య‌లో ప్రవేశాల కోసం నిర్వ‌హించే నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ క‌మ్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ అండ‌ర్ గ్రాడ్యుయేట్ (NEET UG) పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం విచారించింది. జస్టిన్‌ విక్రమ్‌ నాథ్‌(Justice), జస్టిస్‌ అమనుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. మే 5వ తేదీన జరిగిన నీట్‌ పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పేప‌ర్ లీకేజీ(Paper Leakage) ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్లు కోరుతున్నార‌ని, దీనిపై స‌మాధానం చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన నేష‌నల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. విచార‌ణ సంద‌ర్బంగా సుప్రీం ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 'నీట్‌పై వస్తున్న ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి. ఎప్పటిలోగా సమాధానం చెబుతారు? కాలేజీల రీఓపెనింగ్ జరిగిన వెంటనే చెబుతారా? లేదంటే ఈలోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ మొదలవుతుంది’ అని ఎన్‌టీఏ లాయర్‌ను ఉద్ధేశించి జస్టిస్ అమానుల్లా పేర్కొన్నారు. దీనిపై స్పందన తెలపాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి(NTA) నోటీసులు జారీ చేశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్‌ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆలోగా ఎన్‌టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది.
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ - 2024 పరీక్షలో అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వ‌స్తున్నాయి. జూన్ 4న వెలువ‌డిన‌ ఈ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్‌ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది.

Updated On 11 Jun 2024 5:09 AM GMT
Ehatv

Ehatv

Next Story