ఢిల్లీ(Delhi) మాజీ ఆరోగ్య మంత్రి(Ex-Health Minister) సతేంద్ర జైన్‌కు(Satyendra Jain) బెయిల్ లభించింది. వైద్యపరమైన కారణాలతో సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Satyendra Jain
ఢిల్లీ(Delhi) మాజీ ఆరోగ్య మంత్రి(Ex-Health Minister) సతేంద్ర జైన్‌కు(Satyendra Jain) బెయిల్ లభించింది. వైద్యపరమైన కారణాలతో సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సత్యేందర్ జైన్ గత ఏడాది కాలంగా జైలులో ఉన్నారు. నిన్న తీహార్ జైలు(Tihar Jail)లో బాత్‌రూమ్‌లో పడిపోవడంతో తలకు గాయమైంది. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. మధ్యంతర బెయిల్ సమయంలో ఢిల్లీ వదిలి వెళ్లరాదని, మీడియా ముందు ఎలాంటి ప్రకటన చేయరాదని కోర్టు ఆదేశించింది.
ఇదిలావుంటే.. సత్యేంద్ర జైన్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయన లోక్‌నాయక్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తలకు గాయం కావడం వల్ల ఇబ్బంది ఉంది. వైద్యుల బృందం ఆయన్ను పరిశీలిస్తోందని హాస్పిటల్ డైరెక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. కొన్ని పరీక్షలు జరిగాయి. సాయంత్రం నివేదిక వస్తే పరిస్థితి తేలనుందని పేర్కొన్నారు.
