ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌(Delhi Liquor Scam)లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)కు ఊరట లభించింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌(Delhi Liquor Scam)లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు(Supreme Court)లో ఆమెకు బెయిల్‌(Bail) మంజూరు అయ్యింది. ఈడీ(ED) కేసులు ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌(Justies BR Gavai), జస్టిస్‌ విశ్వనాథన్‌(Justice Viswanatha)తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ(Mukul Rohatgi), ఈడీ తరఫున ఏఎస్‌జీ(ASG) సుమారు గంటన్నరపాటు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. 'సీబీఐ(CBI) తుది ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే కవితకు బెయిల్‌ మంజూరు చేస్తున్నాం' అని ధర్మాసనం తీర్పు చెప్పింది. బెయిల్‌పై సుమారు గంటన్నరపాటు వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ పూర్తయింది, చార్జ్‌షీట్‌ కూడా దాఖలైంది. ఈ దశలో కవితను ఇంకా జ్యుడిషియల్ కస్టడిలో ఉంచడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌ పొందేందుకు ఒక మహిళకు అర్హత ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. బెయిల్‌ తిరస్కరించాలంటే సహేతుక కారణం చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సహేతుక కారణం చూపలేదని తెలిపింది. పాస్‌పోర్టు సబ్మిట్‌ చేయాలని, దేశం విడిచి వెళ్లరాదని కవితకు సుప్రీం కోర్టు సూచించింది. రెండు కేసులలో పది లక్షల రూపాయల పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేసింది. లిక్కర్‌ కేసులో అయిదు నెలలుగా అంటే 153 రోజులుగా ఆమె తీహార్‌ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. మార్చి 15వ తేదీన కవితను అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆమె తీహార్‌ జైలులోనే ఉన్నారు.

ఏమిటీ లిక్కర్‌ కేసు?

ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై వాంగ్మూలాన్ని సేకరించిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్‌ లాబీ తరఫున కోట్ల రూపాయలు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్‌ రామచంద్రపిళ్లై రిమాండ్‌ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్‌ గ్రూప్‌ ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆప్‌కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గత ఏడాది మార్చిలో కవితకు నోటీస్‌ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్టు చేసింది.

ehatv

ehatv

Next Story