అత్యాచారం కేసులో(Rape case) నిందితుడిగా ఉన్న మలయాళ నటుడు సిద్దిఖీకి(actor siddique) ఊరట లభించింది.

అత్యాచారం కేసులో(Rape case) నిందితుడిగా ఉన్న మలయాళ నటుడు సిద్దిఖీకి(actor siddique) ఊరట లభించింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను(Interim jail) మంజూరు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదికతో అక్కడ నటీమణులు గతంలో జరిగిన అన్యాయాలను చెబుతూ వస్తున్నారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలోనే మలయాళ నటి రేవతి సంపత్‌(Revathi sampath) చేసిన ఆరోపణలతో సిద్ధిఖీపై కేసు నమోదైంది. 2016లో తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌లో తనపై లైంగిక దాడికి(Sexual harrassment) పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ముందుగా ఒక సినిమాలో ఛాన్స్‌ ఇస్తానని ఫేస్‌బుక్‌ ద్వారా తనకు సిద్ధిఖీ పరిచయం అయ్యాడని, ఆపై తన కోరికను తీర్చాలని బలవంతం చేసినట్లు తెలిపింది. తాను ఒప్పుకోకపోవడంతో ఓ పథకం ప్రకారం తనను హోటల్‌కు రప్పించి సిద్ధిఖీ అత్యాచారం చేసినట్లు చెప్పింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే, చాలారోజులుగా పరారీలో ఉన్న ఆయనకు తాజాగా బెయిల్‌ లభించింది. సిద్ధిక్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. నటుడు ఎలాంటి తప్పు చేయలేదని, ఫిర్యాదుదారు అభియోగాలు అనుమానాస్పదంగా ఉన్నాయని ముకుల్ రోహత్గీ చెప్పారు. సిద్దిఖీకి బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ బేలా త్రివేది, సతీశ్‌ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో సిద్ధిఖీపై ఫిర్యాదు చేయడానికి ఎనిమిదేళ్ల జాప్యం ఎందుకు అయిందని ప్రశ్నించింది. ఈ కారణంతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. అయితే అవసరమైతే పోలీసుల విచారణకు సిద్ధిఖీ సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ క్రమంలో తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్‌ కోర్టులో డిపాజిట్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఆపై కేరళ హైకోర్టు జోక్యం చేసుకున్న పిదపనే అత్యాచార బాధితురాలికి ఫిర్యాదు చేయడానికి ధైర్యం వచ్చిందని బాధితురాలి తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ కోర్టుకు తెలిపారు. అందుకే ఆలస్యం అయ్యిందని వివరణ ఇచ్చుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story