ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvindh Kejriwal) సుప్రీంకోర్టు(Supreme court) మధ్యంతర బెయిల్(Interim bail) మంజూరు చేసింది. తన అరెస్టును సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్ శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్టు చేయడాన్ని పిటిషన్ సవాలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విస్తృత ధర్మాసనానికి పంపింది. అంతకుముందు మే 17న కేజ్రీవాల్ పిటిషన్‌పై ధర్మాసనం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 15న ఈడీ స్పందనను సుప్రీంకోర్టు కోరింది. ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు(Delhi high court) ఇచ్చిన ఆదేశాలను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టును హైకోర్టు సమర్థించింది. ఇందులో ఎటువంటి చట్టవిరుద్ధం లేదని.. దర్యాప్తుji పదేపదే నిరాకరించడంతో EDకి ఎటువంటి అవకాశం లేకుండా పోయిందని పేర్కొంది.
మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై జూన్ 20న ట్రయల్ కోర్టు ఆయనకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే మరుసటి రోజే ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏకపక్షమని.. తప్పు అని ED వాదించింది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది.