బిల్కిస్ బానో కేసులో(Bilkis Bano Case) సుప్రీంకోర్టు(Supreme court) సంచలన తీర్పు చెప్పింది. బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె కుటుంబసభ్యులను దారుణంగా హత్య చేసిన 11 మంది దోషుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి(Gujarat Government) క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బివి నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని తెలిపింది. దోషులు రెండు వారాల్లోగా లొంగిపోయి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.
బిల్కిస్ బానో కేసులో(Bilkis Bano Case) సుప్రీంకోర్టు(Supreme court) సంచలన తీర్పు చెప్పింది. బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె కుటుంబసభ్యులను దారుణంగా హత్య చేసిన 11 మంది దోషుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి(Gujarat Government) క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బివి నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని తెలిపింది. దోషులు రెండు వారాల్లోగా లొంగిపోయి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. విచారణ మహారాష్ట్రలోనే జరిగింది కాబట్టి అలాంటి ఉత్తర్వులు జారీ చేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. అపరాధికి శిక్ష పడిన రాష్ట్ర (మహారాష్ట్ర) ప్రభుత్వానికే ఉపశమనాన్ని మంజూరు చేయడానికి తగిన అర్హత ఉంటుందని తెలిపింది. 2002లో గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార(Molestation) ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో అయిదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దోషులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీకి చెందిన ప్రముఖులు వారికి సన్మాన సత్కారాలు చేశారు. పూలమాలలతో స్వాగతం తెలిపారు. కొన్ని హిందూ సంస్థలు వారిని హీరోలుగా చిత్రీకరించాయి. ఇది ప్రజలలో తీవ్ర అసంతృప్తిని, అసహ్యాన్ని కలిగించాయి. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దోషులకు శిక్షను రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దోషుల్లో ఒకరైన రాధేషామ్ షా న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించాడు. మొత్తం మీద దోషులు మళ్లీ జైలుకెళుతున్నారు. బిల్కిస్ బానోకు న్యాయం లభించింది.