తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin) తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై(Udayanidhi Stalin) సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సనాతన ధర్మంపై(Sanatan daram) ఉదయనిధి చేసిన వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఆయన వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

Supreme Court
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin) తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై(Udayanidhi Stalin) సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సనాతన ధర్మంపై(Sanatan daram) ఉదయనిధి చేసిన వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఆయన వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఉదయనిధి తీరును తప్పుపట్టిన సప్రీంకోర్టు పరిణామాలు అలా ఉంటాయని తెలిసి కూడా అలా మాట్లాడతారేమిటి అని సీరియస్సయ్యింది. ఉదయనిధిపై తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఆరు చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీటన్నింటినీ ఒకే చోట విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఉదయనిధి. అయితే ఉదయనిధి పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగం మీకు అందించిన ఆర్టికల్ 19(1)(a) మీరే అగౌరవపర్చుకున్నారని, ఆర్టికల్ 25ను కూడా మీరే ఉల్లంఘించుకున్నారని మండిపడింది. ఇప్పుడు మీ హక్కును రక్షించాలంటూ మీరే ఆర్టికల్ 32 ప్రకారం కోర్టును ఆశ్రయిస్తారని, మీరు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు తెలియందా? అని నిలదీసింది. 'మీరు సామాన్యులేం కాదు కదా. మీరు ఒక మంత్రి. జరగబోయే పరిణామాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది' అని ధర్మాసనం అక్షింతలు వేసింది.
