నిజంగానే మన దేశ ఓటర్లు పార్టీల సింబల్స్‌ను గుర్తు పట్టలేరా? అది కారో, కమలమో, హస్తమో, రోడ్డురోలరో తెలియనంత అజ్ఞానులా? రాజకీయ పార్టీల అభిప్రాయం మాత్రం ఇలాగే ఉంది. ఎన్నికలప్పుడు పోల్‌ మేనేజ్‌మెంట్‌కు పార్టీలు ఇంపార్టెన్స్‌ ఇస్తుంటాయి.

నిజంగానే మన దేశ ఓటర్లు పార్టీల సింబల్స్‌ను గుర్తు పట్టలేరా? అది కారో, కమలమో, హస్తమో, రోడ్డురోలరో తెలియనంత అజ్ఞానులా? రాజకీయ పార్టీల అభిప్రాయం మాత్రం ఇలాగే ఉంది. ఎన్నికలప్పుడు పోల్‌ మేనేజ్‌మెంట్‌కు పార్టీలు ఇంపార్టెన్స్‌ ఇస్తుంటాయి. తమ ప్రత్యర్థులపై ఎలా గెలవాలన్న అంశంపై వ్యూహాలు రచించే పార్టీలు ప్రత్యర్థులకు కంగారుపట్టించే ప్రణాళికులు కూడా వేస్తుంటాయి. ఫర్‌ ఎగ్జాంపుల్‌ ప్రత్యర్థి పేరుతో పాటు ఇంటిపేరు కూడా ఒకేలా ఉన్న వ్యక్తులను వెతికి మరీ నామినేషన్‌ వేయిస్తారు.

అలాగే రాజకీయ పార్టీల గుర్తులను పోలి ఉండేలా ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తుంటుంది ఎన్నికల సంఘం(Elecction Commission). దీంతో ఓటరు కన్ఫ్యూజ్‌ అయి తాము అనుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థి గుర్తుకు ఓటు వేస్తుంటాడు. ఇలా జయాపజయాలు తారుమారు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది గమనించే బీఆర్‌ఎస్‌(BRS) అప్రమత్తమయ్యింది. తమ ఎన్నికల సింబల్‌ కారును(Car) పోలిన రోడ్డు రోలర్‌, చపాతి మేకర్‌ తదితర గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్(Supreme Court) దాఖలు చేసింది బీఆర్‌ఎస్‌.

పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్‌ అభయ్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మన దేశ ఓటర్లు రోడ్డు రోలర్‌, చపాతి మేకర్‌, కారు గుర్తులకు తేడా తెలియనంత అమాయకులేమీ కాదని కామెంట్‌ చేస్తూ బీఆర్ఎస్ పిటిష‌న్‌ను కొట్టి వేసింది. రోడ్డు రోల‌ర్‌, చ‌పాతి మేక‌ర్ గుర్తుల‌తో తాము ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోయామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బీఆర్ఎస్ కంప్లయంట్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అక్కడ కూడా బీఆర్‌ఎస్‌కు నిరాశే మిగిలింది.

Updated On 20 Oct 2023 7:27 AM GMT
Ehatv

Ehatv

Next Story