సినీనటి జయప్రదకు(jayaprada) సుప్రీంకోర్టులో(Supreme court) ఊరట దక్కింది. చెన్నైలోని తన సినిమా థియేటర్‌లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్‌ఐ(ESI) కాంట్రిబ్యూషన్‌ చెల్లించని కేసులో ఆమెకు గతంలో కిందిస్థాయి కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

సినీనటి జయప్రదకు(jayaprada) సుప్రీంకోర్టులో(Supreme court) ఊరట దక్కింది. చెన్నైలోని తన సినిమా థియేటర్‌లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్‌ఐ(ESI) కాంట్రిబ్యూషన్‌ చెల్లించని కేసులో ఆమెకు గతంలో కిందిస్థాయి కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. థియేటర్‌ యాజమాన్యం రూ.9.80 లక్షల ఈఎస్‌ఐ కాంట్రిబ్యుషన్‌ కింద జమచేయడంతో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఓకా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసం ఈ తీర్పు ఇచ్చింది. జయప్రదకు చెందిని సినిమా థియేటర్‌లో ఆమె ఇద్దరు సోదరులు భాగస్వాములగా ఉన్నారు. అయితే ఈ సినిమా థియేటర్‌ 10 ఏళ్ల క్రితమే మూతపడిపోయింది. ఆ కాలంలో ఈ థియేటర్‌లో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి పీఫ్‌ను కట్‌ చేసుకున్న యాజమాన్యం తమ కాంట్రిబ్యూషన్‌ను మాత్రం చెల్లించలేదు. దీంతో థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన చెన్నైలోని మెట్రోపాలిటన్‌ కోర్టు 2023 ఆగస్ట్‌లో జయప్రదకు 6 నెలల జైలుశిక్ష(Jail punishment) విధించింది. దీంతో జయప్రద మెట్రోపాలిటన్‌ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసి, ఈఎస్‌ఐ కాంట్రిబ్యూషన్‌ను చెల్లించడంతో ఈ మేరకు సుప్రీంకోర్టు జైలు శిక్షను రద్దు చేసింది.

Updated On 18 March 2024 2:10 AM GMT
Ehatv

Ehatv

Next Story