జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నుంచి విచారణ చేపట్టనుంది.

Supreme Court CJI constitution bench hearing on article 370 held today
జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370(Article 370) రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(CJI Dhananjaya Yeshwant Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నుంచి విచారణ చేపట్టనుంది.
గత జూలై 11న, ఆర్టికల్ 370పై విచారణకు ఫ్రేమ్‌వర్క్‌ను నిర్దేశించిన సుప్రీంకోర్టు, ఆగస్టు 2 నుండి రోజువారీ విచారణలను కోరింది. అయితే, ఈ కేసును సాధారణ విచారణ రోజుల్లో అంటే మంగళ, బుధ, గురువారాల్లో విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో సోమ, శుక్రవారాలలో కొత్త కేసులు విచారిస్తారు.
ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్(Justice Sanjay Kishan Kaul), జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna), జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai), జస్టిస్ సూర్యకాంత్(Justice Suryakant) ఉన్నారు. దీనికి ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు.
05 ఆగస్టు 2019న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్(Jammu Kshmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ, కాశ్మీర్‌ను లడఖ్(Ladakh), జమ్మూ కాశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. పిటిషన్‌లో 370ని తొలగించే చట్టబద్ధత,చట్టపరమైన ప్రక్రియను ప్రశ్నించారు.
నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పిటిషన్లు సుప్రీంకోర్టు(Supreme COurt)లో విచారణకు వచ్చాయి. 2 మార్చి 2020న, ఈ అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి పంపాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది అవసరం లేదని.. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుందని కోర్టు పేర్కొంది.
ఈ విషయంలో జూలై 10న కేంద్ర ప్రభుత్వం తాజా అఫిడవిట్‌ను దాఖలు చేసింది, ఇందులో జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. మొత్తం ప్రాంతం శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని చూసిందని కేంద్రం పేర్కొంది. అయితే న్యాయస్థానం ముందు కేవలం చట్టానికి సంబంధించిన అంశం మాత్రమే ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
