మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి(Montly leaves) చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి(Montly leaves) చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. నెలసరి సెలవులు అన్నది మంచి నిర్ణయమే అయినా దీనివల్ల మహిళలు అవకాశాలకు దూరం అవుతారని సుప్రీ కోర్టు తెలిపింది. ఇప్పటి వరకు కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయని, మిగతా రాష్ట్రాలలోనూ తప్పనిసరిగా సెలవులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మహిళలకు పీరియడ్‌ లీవ్‌లు ఇవ్వడం మంచిదేనని, దానివల్ల వారు మరింత ఉద్యోగాలు చేసుకోగలుగుతారని సుప్రీం చెబుతూ వీటిని తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతపెడితే మాత్రం ప్రతికూల పరిస్థితులు రావచ్చని చెప్పింది. పైగా ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ నెలసరి సెలవులపై పిటిషన్‌ దాఖలైంది.. అయితే దానిపై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దేశంలో నెలసరి సెలవులను బీహార్‌, కేరళ రాష్ట్రాలు మాత్రమే ఇస్తున్నాయి. బీహార్‌ ప్రభుత్వం 1992 నుంచే మహిళా ఉద్యోగులకు రెండు రోజులు నెలసరి సెలవులను ఇస్తోంది. కేరళ(Kerala) కూడా విద్యార్థినులకు మూడు రోజుల పీరియడ్‌ లీవ్‌ ఇస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story