ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన పెర్నోడ్ రికార్డ్ ఇండియా రీజినల్ మేనేజర్ బెనోయ్ బాబు(Benoy Babu)కు సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ తీర్పు సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ..

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన పెర్నోడ్ రికార్డ్ ఇండియా రీజినల్ మేనేజర్ బెనోయ్ బాబు(Benoy Babu)కు సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ తీర్పు సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ.. “విచారణకు ముందు ప్రజలను కటకటాల వెనుక ఉంచలేరు. ఇది సరైనది కాదు.. విచార‌ణ‌ ఎలా సాగుతుందో మాకు ఇంకా తెలియదు.. సీబీఐ ఆరోపిస్తున్నదానికి.. ఈడీ ఆరోపిస్తున్నదానికి మధ్య వైరుధ్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

అంతకుముందు డిసెంబర్ 4న ఢిల్లీ కోర్టు బెనోయ్ బాబుకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. దవడ ఎముక, చిగుళ్ల వ్యాధికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంటూ బాబు వైద్య కారణాలపై కొద్దికాలం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. 2022 నవంబర్ 10న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బెనోయ్ బాబును అరెస్టు చేయ‌గా.. ప్రస్తుతం ఆయ‌న‌ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Updated On 8 Dec 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story